'దేవదాస్' నుంచి వినాయక చవితి స్పెషల్ సాంగ్
Advertisement
నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా రూపొందుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తోన్న ఈ మల్టీ స్టారర్ పై అందరిలోనూ ఆసక్తి వుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రేపు 'వినాయకచవితి' కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాలోని వినాయక నిమజ్జన ఉత్సవానికి సంబంధించిన పాటను వదిలారు.

"లక లక లకుమీకరా లంబోదరా .. జగ జగ జగదోద్ధారా విఘ్నేశ్వరా . .  లక లక లకుమీకరా లంబోదరా .. రకరకముల రూపాలు నీవే దొరా .. వెళ్లి రారా .. మళ్లీ రారా .. ఏడాదికోసారి మాకై దిగిరారా .." అంటూ ఈ పాట కొనసాగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. మణిశర్మ సంగీతం ఆకట్టుకునేలా వున్నాయి. అనురాగ్ కులకర్ణి .. శ్రీకృష్ణ ఈ ఉత్సవం పాటను మంచి ఉత్సాహంతో ఆలపించారు. వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి జనం నాల్కలపై నాట్యం చేసే సినిమా పాటల్లో ఒకటిగా ఈ పాట నిలిచిపోతుందని చెప్పొచ్చు.
Wed, Sep 12, 2018, 12:19 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View