తెలంగాణకు టీడీపీ అవసరం లేదు: కిషన్ రెడ్డి
Advertisement
తెలంగాణ రాష్ట్రానికి టీడీపీ అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు అనైతికమని విమర్శించారు. తన వైఫల్యాలను బీజేపీపై చంద్రబాబు రుద్దుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు అనైతిక పొత్తులకు తెరదీశారని విమర్శించారు.

మరోపక్క, యథేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించి, రాజకీయ విలువలకు టీఆర్ఎస్ పార్టీ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. తెలంగాణలో సకల దరిద్రాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని చెప్పారు. 
Wed, Sep 12, 2018, 12:04 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View