తెలుగులో నా మొదటి సినిమా అదే!: సీనియర్ నటి వరలక్ష్మి
Advertisement
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో వరలక్ష్మి ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. కూతురు .. చెల్లెలు పాత్రలను ఆమె ఎక్కువగా చేశారు. 1970 - 80 దశకాల్లో ఆమె చేసిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె టీవీ సీరియల్స్ లో బిజీగా వున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

 "తెలుగులో నేను తెరపై కనిపించిన తొలి చిత్రం 'అందాల రాముడు'. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగారు నన్ను ఎత్తుకునే 'ఎదగడాని కెందుకురా తొందరా .. ఎదర బతుకంతా చిందరవందర' అనే పాట పాడతారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాను .. వాటిలో కొన్ని గుర్తు కూడా లేవు. సిస్టర్ పాత్రల్లోనే ఓ 100 సినిమాలు చేశాను. మొత్తంగా చూసుకుంటే 200 సినిమాలకి పైగా చేసి వుంటాను. అప్పట్లో ఈ తరహా పాత్రలను నాతో పాటు రోహిణి .. తులసి చేసేవారు" అంటూ చెప్పుకొచ్చారు. 
Wed, Sep 12, 2018, 11:55 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View