తెలంగాణలో ఈసీ భేటీకి ఆలస్యంగా కలెక్టర్లు.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎస్!
Advertisement
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జలమండలి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, కలెక్టర్లు, ఎస్పీలు సహా పలువురు ఉన్నతాధికారులతో ఈ రోజు ఉదయం కేంద్ర ఎన్నికల బృందం సమావేశమయింది. కాగా, ఈ సమావేశానికి పలువురు కలెక్టర్లు ఆలస్యంగా వచ్చారు.

జలమండలి కార్యాలయంలో కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా అధ్యక్షతన ఈ రోజు ఉదయం సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి కలెక్టర్లు దివ్య, శ్వేత మహంతి, భారతి హోలికేరి, అమయి కుమార్ తదితరులు ఆలస్యంగా వచ్చారు. దీంతో సీఎస్ ఎస్కే జోషీ వీరందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సీరియస్ గా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు అధికారులు ఈసీ బృందంతో సమావేశం కానున్నారు.
Wed, Sep 12, 2018, 11:28 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View