అప్పుడు మాత్రం అన్నయ్యకి చాలా కోపం వచ్చేసింది: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement
సినీ రచయితగా సుదీర్ఘకాలంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోన్న పరుచూరి గోపాలకృష్ణ, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో దర్శకుడు కె.మురళీ మోహన రావు గురించి ప్రస్తావించారు. "దర్శకుడు మురళీ మోహనరావుగారు .. కె.బాపయ్య గారి దగ్గర కో డైరెక్టర్ గా ఉండేవారు. 'నివురు గప్పిన నిప్పు' సినిమా నుంచి ఆయన నాకు పరిచయం.

బాపయ్య గారికి 'కథానాయకుడు' కథ చెప్పినప్పుడు, ఆ కథ తనకి వద్దని ఆయన చెప్పేశాడు. అప్పుడు అక్కడే వున్న మురళీమోహనరావు .. 'ఈ కథ బాగుంది .. నాకు ఇస్తారా .. నన్ను రామానాయుడు గారు డైరెక్ట్ చేయమంటున్నారు' అని అడిగాడు. అప్పుడు అన్నయ్య వెంకటేశ్వరరావు కొన్ని మార్పులు చేసి గంటన్నర సేపు కథ మొత్తం చదువు వినిపించి 'ఎలా ఉంది మురళీ?' అని అడిగారు.

 అప్పుడు ఆయన 'నేను వినలేదు' అన్నారు. అంతే.. అన్నయ్య కోపం తారస్థాయికి చేరిపోయింది. 'గంటన్నరపాటు కష్టపడి కథ చెబితే 'నేను వినలేదు' అనే వ్యక్తికి మనం రాసేదేంట్రా .. పద పోదాం' అని నాతో అన్నారు. అప్పుడు నేనే అన్నయ్యకి నచ్చజెప్పవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.        
Wed, Sep 12, 2018, 11:17 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View