బీరులో విషం కలిపి ప్రియుడిని చంపిన ప్రియురాలు!
Advertisement
ప్రియుడిని నమ్మించి, హత్య చేసి, పరారైన ప్రియురాలి బాగోతం నోయిడాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, నోయిడాలోని సెక్టార్ 15లో మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఓ గదిలో 21 ఏళ్ల అన్షుల్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అన్షుల్ తన ప్రియురాలితో కలసి హరొల్లాలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు. రాత్రి వేళ తన ప్రియుడికి బీరులో విషం కలిపి తాగించి ఆమె పరారైంది. విషం కలిపిన బీరు తాగడం వల్లే అన్షుల్ మరణించాడని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు... మృతుడు ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. పరారైన ప్రియురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Wed, Sep 12, 2018, 11:09 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View