తుపాకులకు ఎదురొడ్డి...దొంగల్ని బెదరగొట్టిన సాహస మహిళ!
Advertisement
దోపిడీ దొంగల్నే హడలు గొట్టించి పరుగులు పెట్టించిందో సాహస మహిళ. తుపాకులతో బెదిరించి రూ.75 లక్షల విలువైన ఆమె జీప్‌ను ఎత్తుకు పోవాలనుకుని వచ్చిన వారిని ఎదిరించి పారిపోయేలా చేసింది ఆమె. దక్షిణాఫ్రికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన జీప్‌లో పిల్లలతో పాటు ఈ మహిళ ఇంటికి వెళుతుండగా ఐదుగురు దుండగులు మరో కారులో ఆమెను వెంబడించారు. ఆమె ఇంటి వద్ద వాహనం దిగుతుండగా నలుగురు దుండగులు ఆమె జీప్‌ను చుట్టుముట్టి తుపాకులు తీసి బెదిరించడం ప్రారంభించారు. ఊహించని ఈ పరిణామంతో బిత్తర పోయిన ఆమె వెంటనే జీపును వేగంగా వెనక్కి పోనిచ్చింది.

దీంతో కంగారుపడిన దుండగులు పరుగందుకున్నారు. అయినా ఆగని ఆమె మరింత వేగంగా తన జీప్‌ నడిపి దుండగుల కారును ఢీకొట్టించింది. దీంతో కారులో చిక్కుకున్న మిగిలిన దొంగ కూడా అద్దాలు పగులగొట్టి బయట పడేందుకు ప్రయత్నించాడు. ’సీసీ కెమెరా పుటేజీ చూస్తేగాని నేనింతటి సాహసం చేశానని అర్థం కాలేదు’ అని సదరు మహిళ వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో ఓ చిన్నారికి గాయమైంది. పోలీసులు ఐదుగురు దొంగల్ని అరెస్టు చేశారు.
Wed, Sep 12, 2018, 10:51 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View