వదినను లైంగికంగా వేధించిన ప్రబుద్ధుడు.. తలపై బండరాయితో కొట్టిచంపిన అన్న!
Advertisement
తల్లిగా గౌరవించాల్సిన వదినపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు ఆమెను లైంగికంగా వేధించాడు. ఇంట్లోవాళ్లు ఎంతగా నచ్చచెప్పినా మారలేదు. చివరికి సహనం కోల్పోయిన అన్న తమ్ముడి తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో గంగాధరరావు, ఈశ్వరమ్మ దంపతులు స్థానికంగా తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఉంటున్న గంగాధరరావు సోదరుడు సాంబశివరావు వదినపై కన్నేశాడు. తన కోరికను తీర్చాలని ఆమెను వేధించేవాడు. ఈ విషయమై మిగతా కుటుంబ సభ్యులు ఎంతగా నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు.

మంగళవారం సాయంత్రం అన్న ఇంటివద్దకు చేరుకున్న సాంబశివరావు తన కోరిక తీర్చాలని మరోసారి ఈశ్వరమ్మను వేధించసాగాడు. అప్పుడే ఇంటికి వచ్చిన గంగాధర రావు తమ్ముడిని చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. పక్కనే ఉన్న బండరాయి తీసుకుని తమ్ముడి తలపై మోది కిరాతకంగా హత్యచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Wed, Sep 12, 2018, 10:20 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View