కర్ణాటకలో వియ్యంకులు కాబోతున్న అధికార, విపక్ష నేతలు!
Advertisement
‘రాజకీయం వేరు, కుటుంబ సంబంధాలు వేరు’... కర్ణాటకలోని అధికార, విపక్ష పార్టీల నాయకులు ఈ విషయాన్నే రుజువు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రి రమేష్‌ జర్కిహోలి కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు నిర్ణయించినట్లు సమాచారం. శ్రీరాములు కుమార్తె లండన్‌లో చదువుతోంది. వాల్మీకి కులానికి చెందిన రెండు కుటుంబాల మధ్య పెళ్లి ఏర్పాట్ల విషయమై చర్చలు జోరుగా సాగుతున్నట్లు సన్నిహిత వర్గాల భోగట్టా.
Wed, Sep 12, 2018, 10:11 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View