కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!
Advertisement
తనను ప్రేమించాలని వెంటపడ్డ యువకుడు చివరికి ఆమె అంగీకరించకపోవడంతో దాడికి తెగబడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లాలోని గంపలగూడెం కొణిజర్లకు చెందిన ఝాన్సీ స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన గోపీ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ ఆమె వెంట పడ్డాడు. ఇందుకు యువతి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో నిన్న కళాశాల నుంచి ఇంటికి వస్తుండగా ఆమెను అడ్డుకున్న గోపీ.. దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన యువతి నిన్న పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

గోపీ వేధింపుల కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Wed, Sep 12, 2018, 09:41 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View