భార్య అంత్యక్రియల కోసం నవాజ్ షరీఫ్‌కు పెరోల్.. కుమార్తె, అల్లుడికి కూడా!
Advertisement
దీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో కన్నుమూసిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సుం నవాజ్ (68) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నవాజ్‌కు పెరోల్ లభించింది. లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుల్సం మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన నవాజ్ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతి లభించింది. కుల్సుం భౌతిక కాయాన్ని లాహోర్ తీసుకొచ్చి షరీఫ్ కుటుంబానికి సంబంధించిన నివాస ప్రాంగణంలో ఖననం చేస్తారు.

అక్రమ ఆస్తుల కేసులో మాజీ ప్రధాని నవాజ్, ఆయన కుమార్తె మర్యం నవాజ్, అల్లుడు సఫ్దర్‌లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి కూడా పెరోల్ లభించింది. కాగా, కుల్సుం మరణవార్తతో పాకిస్థాన్‌లోని నవాజ్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Wed, Sep 12, 2018, 09:12 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View