వైసీపీకి మరో ఎదురుదెబ్బ... టీడీపీలోకి కాకినాడ నేత చెలమలశెట్టి సునీల్?
Advertisement
వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి కాకినాడ నేత చెలమలశెట్టి సునీల్ షాకిచ్చారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సునీల్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీలో చేరేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. వచ్చే నెల రెండో వారంలో చంద్రబాబు సమక్షంలో  సునీల్ టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.
Wed, Sep 12, 2018, 08:10 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View