రేపు ఏ పార్టీలో ఉంటానో తెలీదు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
Advertisement
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కుండబద్దలుగొట్టారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని తేల్చి చెప్పారు. ‘‘ఈ రోజు బీజేపీలో ఉన్నాను. రేపు ఉంటానో లేదో తెలియదు.. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా’’ అని పేర్కొన్నారు. ఏపీకి బీజేపీ ఇచ్చిన నిధుల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తుండగా, టీడీపీ నేతలు కల్పించుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. దీంతో స్పందించిన విష్ణుకుమార్ రాజు ఈ విధంగా వ్యాఖ్యానించారు.

తాను ఏ పార్టీలో ఉన్నా వాస్తవాలే మాట్లాడతానని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తన నైజమన్నారు. గుజరాత్‌లో పటేల్ విగ్రహానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని ఆరోపిస్తున్నారని, నిజానికి దానికి ఇచ్చింది రూ.300 కోట్లేనని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందన్న ఆయన, అందుకోసం తాను కూడా పోరాడతానని పేర్కొన్నారు.
Wed, Sep 12, 2018, 07:24 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View