ఇందిరాగాంధీ తర్వాత చంద్రబాబుదే ఆ ఘనత!
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. పోలవరం నిర్మాణంలో కీలకమైన గ్యాలరీ వాక్‌ను నేటి ఉదయం 10 గంటలకు ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం గ్యాలరీ వాక్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. గ్యాలరీ వాక్‌తో చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.

స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ఇందిరాగాంధీ హయాంలో సాగర్ గ్యాలరీ పనులు పూర్తయ్యాయి. ప్రధాని హోదాలో ఇందిర గ్యాలరీ వాక్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకే ఆ అదృష్టం దక్కింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ పోలవరం నిర్మాణంలో గ్యాలరీ వాక్‌ను చూశామన్న తృప్తి తమకు మిగులుతుందని పేర్కొన్నారు. కాగా, స్పిల్‌వే, స్పిల్ చానల్ నిర్మాణాల్లో వేగం పుంజుకుంటే గ్యాలరీ వాక్‌కు సందర్శకులను అనుమతించే అవకాశం ఉండదు.
Wed, Sep 12, 2018, 07:01 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View