నేడు దుబాయ్‌ వెళ్లాల్సినోడు.. నిన్న కిడ్నాపయ్యాడు: చిత్తూరులో కలకలం!
Advertisement
నేడు దుబాయ్ వెళ్లాల్సిన యువకుడు.. నిన్న కిడ్నాపయ్యాడు. చిత్తూరులోని రేణిగుంటలో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను అడ్డగించిన దుండగులు వారి కళ్లలో కారం చల్లి దాడి చేశారు. బైక్‌పై పెట్రోలు పోసి తగలబెట్టారు. అనంతరం ఖాదర్ బాషా అనే యువకుడిని తమతోపాటు తీసుకెళ్లారు.

తీవ్ర గాయాలపాలైన ఖాదర్ బాషా స్నేహితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కిడ్నాప్‌కు కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. కాగా, కిడ్నాప్‌కు గురైన ఖాదర్ బాషా నేడు (బుధవారం) దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అతడు దుబాయ్ వెళ్లబోతున్నాడని తెలిసే దుండగులు ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Wed, Sep 12, 2018, 06:43 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View