పోలవరంలో నేడు ఆవిష్కృతం కానున్న మరో అద్భుతం!
Advertisement
ప్రతిష్ఠాత్మక పోలవరం నిర్మాణంలో నేడు మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టులో ఇప్పటికే పలు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తికాగా, తాజాగా స్పిల్‌వే గ్యాలరీ వాక్‌ను సిద్ధం చేశారు. ఈ ఉదయం 10:05 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం ఆదేశించారు. ప్రారంభానికి 20 నిమిషాల ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు పోలవరం చేరుకోవాలంటూ మంగళవారం సీఎంవో ఆహ్వానాలు పంపింది.

గ్యాలరీ వాక్‌ను ప్రారంభించిన అనంతరం 48వ బ్లాక్‌లోకి చంద్రబాబు ప్రవేశించి 36వ బ్లాక్ వరకు నడుస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చి బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. కార్యక్రమానికి హాజరుకానున్న 5 వేల మంది సందర్శకులతో చంద్రబాబు సమావేశమవుతారు. గ్యాలరీ వాక్‌లో సీఎం వెంట మంత్రి లోకేశ్, కుటుంబ సభ్యులు, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నడవనున్నారు.
Wed, Sep 12, 2018, 06:32 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View