‘దేవదాస్’ చిత్రీకరణ పూర్తయింది.. చిత్రయూనిట్ కు థ్యాంక్స్: హీరో నాగార్జున
Advertisement
Advertisement
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరోలు నాగార్జున, నానీలు నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘దేవదాస్’ చిత్రీకరణ పూర్తయిందని, చిత్రయూనిట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, చాలా అమేజింగ్ గా అనిపించిందని ఆ ట్వీట్ లో నాగ్ పేర్కొన్నారు.

ఈ ట్వీట్ పై దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వెంటనే స్పందిస్తూ, ‘ధన్యవాదాలు నాగార్జున సార్. మీతో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా అనిపించింది’ అని ట్వీట్ చేశారు. నాగ్ ట్వీట్ కు హీరో నాని కూడా స్పందించాడు. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఈ నెల 27న ‘దేవదాస్’ విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ నటించారు. 
Tue, Sep 11, 2018, 08:48 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View