'గీత గోవిందం' హీరోయిన్ రష్మిక మందన నిశ్చితార్థం రద్దు.. స్పష్టం చేసిన రష్మిక తల్లి!
Advertisement
'గీత గోవిందం' సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ రష్మిక మందన వివాహ నిశ్చితార్థం రద్దైంది. ఈ విషయాన్ని ఆమె తల్లి సుమన్ స్పష్టం చేశారు. తన కుమార్తె నిశ్చితార్థం రద్దయిందని చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తామంతా చాలా డిస్టర్బ్ అయ్యామని... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ జీవితం చాలా ముఖ్యమని... ఎదుటి వ్యక్తి బాధ పెడితే ఎవరికీ ఇష్టం ఉండదని తెలిపారు.

2017లో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే, ఈ నిశ్చితార్థం రద్దయిందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో సక్సెస్ కావడంతో, కెరీర్ కోసం రష్మిక ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Tue, Sep 11, 2018, 06:19 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View