నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ కన్నుమూత
Advertisement
పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సతీమణి బేగం కుల్సుమ్ నవాజ్ (68) కన్నుమూశారు. కొంతకాలంగా గొంతు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె లండన్ లోని హ్యార్లీ స్ట్రీట్ క్లినిక్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడం, ఊపిరితిత్తుల సమస్య కూడా తలెత్తడంతో ఆమెకు కృత్రిమశ్వాసను అందించారు.

 ఆమె కోలుకునేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. కాగా, కుల్సుమ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, అవినీతి ఆరోపణల కేసులో నవాజ్, కుమార్తె మర్యమ్ లు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
Tue, Sep 11, 2018, 05:59 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View