నన్ను జైల్లో పెట్టి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నారు!: కేసీఆర్ పై జగ్గారెడ్డి ఫైర్
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. తనను అక్రమంగా జైల్లో పెట్టి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలనేది కేసీఆర్ ప్లానని దుయ్యబట్టారు. ఇన్ని సంవత్సరాలుగా లేని ఈ కేసును ఇప్పుడే ఎందుకు బయటకు తీశారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనే ఉద్దేశంతోనే తనలాంటి నేతలపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లలో పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. మళ్లీ ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ అరెస్టులని అన్నారు.
Tue, Sep 11, 2018, 05:52 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View