కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. రహానే ఔట్!
Advertisement
ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా పరాజయం దిశగా సాగుతున్నట్టే కనిపిస్తోంది. 37 పరుగులు చేసిన రహానే అలీ బౌలింగ్ లో జెన్నింగ్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ 73 పరుగులతో ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్, రహానేలు నాలుగో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రహానే ఔట్ కాగానే తెలుగు కుర్రాడు విహారి క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 120 పరుగులు. మ్యాచ్ గెలవాలంటే మరో 344 పరుగులు చేయాలి. ఈరోజు మరో 72 ఓవర్లు మిగిలి ఉన్నాయి.
Tue, Sep 11, 2018, 05:03 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View