గుండెలు పిండేసే విషాదం ఇది!: కొండగట్టు బస్సు ప్రమాదంపై పవన్ కల్యాణ్
Advertisement
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురవడం పట్ల పవన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాటలకు అందని విషాదం. గుండెలు పిండేసే హృదయవిదారక సంఘటన. తెలంగాణలోని కొండగట్టు ఘాట్ రోడ్ బస్సు ప్రమాదంలో 50 మంది వరకు మృతి చెందారని, మరో పదిమంది గాయపడ్డారని తెలిసిన వెంటనే మనసంతా భారంగా దుఃఖంతో నిండిపోయిందని పవన్ దిగ్బ్రాంతి వక్తం చేశారు. మృతిచెందిన వారిలో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉండడం మరింత బాధాకరం.

కొద్ది క్షణాల్లో మృత్యువు పొంచి ఉందని తెలియని ఆ అమాయక ప్రయాణికులను తలచుకుంటే మనసు ద్రవించిపోతోంది. ఆర్టీసీ బస్సులు ప్రయాణించని ఈ ఇరుకైన ఘాట్ మార్గంలోకి ప్రమాదానికి గురయిన బస్సు అమాయకుల ప్రాణాలను బలితీసుకోడానికే వచ్చినట్లు అనిపిస్తోంది. నిండు ప్రయాణికులతో వెళుతున్న ఈ బస్సు లోయలోకి పడిపోవడం దురదృష్టకరం. చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాల వారికి సంతాపం తెలుపుతున్నాను. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ తెలిపారు.
Tue, Sep 11, 2018, 04:48 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View