‘జనసేన’ మొట్టమొదటి అభ్యర్థిగా పితాని బాలకృష్ణను ప్రకటిస్తున్నా!: పవన్ కల్యాణ్
Advertisement
ఏపీలో ‘జనసేన’ నుంచి మొట్టమొదటి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణకే అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ నేత పితాని బాలకృష్ణకు పార్టీ కండువా కప్పి ‘జనసేన’లోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, మొట్టమొదటి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ కేనని, ఇంకెవ్వరికీ ఇవ్వనని అన్నారు. పితాని బాలకృష్ణ కానిస్టేబుల్ గా చేశారని, తన తండ్రి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని, తమది ‘పోలీస్ కులం’ అని చెప్పి నవ్వులు చిందించారు. పితానిని చూడగానే ఆయనకు టికెట్టు ఇవ్వాలనిపించిందని, ఆయన భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అందుకని, పితాని బాలకృష్ణను ‘జనసేన’ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.  
Tue, Sep 11, 2018, 04:22 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View