తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్: రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్
Advertisement
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నారని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ ఆర్కే శ్రీవాస్తవ తెలిపారు. లాలూకు చికిత్స అందిస్తున్న వైద్యులు.. లాలూ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని తమ రిపోర్ట్ లో పేర్కొన్నారని వెల్లడించారు. లాలూ మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు గతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కూడా పేర్కొన్నారని చెప్పారు.

లాలూ పరిస్థితిని మెరుగుపరిచేందుకు సైకియాట్రిస్టుకు బాధ్యతలను అప్పగించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. సైకియాట్రిస్టుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దాణా కుంభకోణంలో జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూ... ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తన కుమారులిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కూడా లాలూను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు.
Tue, Sep 11, 2018, 03:35 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View