నిర్భయ నిందితుల శిక్ష అమలులో జాప్యమెందుకు?: మహిళా కమిషన్‌
Advertisement
నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని తీహార్‌ జైలు అధికారులను ఢిల్లీ మహిళా కమిషన్‌ ప్రశ్నించింది. ఈ మేరకు అధికారులకు నోటీసులు జారీచేసింది. దోషులంతా ప్రస్తుతం ఇదే జైల్లో ఉంటున్నారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషులైన ముఖేష్‌ (29), పవన్‌ (22), విజయ్‌శర్మ (23), అక్షయ్‌కుమార్‌సింగ్‌ (31)లకు ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐదో నిందితుడు రాంసింగ్‌ 2013లో జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

దోషులు సుప్రీంకోర్టులో క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను 2017 మేలో తిరస్కరించింది. ఇక శిక్ష అమలు చేయడమే మిగిలి ఉండగా జాప్యానికి కారణం ఏంటో తెలపాలని కోరింది. దోషులను వెంటనే ఉరితీయాలని కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి కోరారు.
Tue, Sep 11, 2018, 12:59 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View