ప్రియురాలిపై స్నేహితులతో అత్యాచారం చేయించిన ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమారుడు!
Advertisement
ప్రియురాలిపై తన స్నేహితులతో ప్రియుడు అత్యాచారం చేయించిన దారుణ ఘటన ఆదివారం నాడు ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, 25 ఏళ్ల యువతి, 24 ఏళ్ల ధరణ్ షా అనే యువకుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి... ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని వీడియోలను చిత్రీకరించి, ఆ తర్వాత డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇప్పటికే రూ. 4 లక్షలను తీసుకున్నాడు.

రానురాను ధరణ్ షా ఆగడాలు మరింత శ్రుతిమించాయి. కెనడా ట్రిప్ కోసం తనకు డబ్బు ఇవ్వాలని బాధితురాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో... తన స్నేహితుడితో గడపాలని ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో, ఆదివారం నాడు ధరణ్ షా స్నేహితులు ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ధరణ్ షాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపారు. విచారణలో తన నేరాన్ని అతను ఒప్పుకున్నాడు. ఆ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రముఖ వజ్రాల వ్యాపారి హితేష్ షా కుమారుడే ధరణ్ షా అని తెలిపారు. 
Tue, Sep 11, 2018, 12:57 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View