యూపీఎస్సీ వెబ్ సైట్ హ్యాక్.. హోమ్ పేజ్ పై డోరేమాన్ బొమ్మ!
Advertisement
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు. నిన్న రాత్రి వెబ్ సైట్ హ్యాక్ అయింది. వెబ్ సైట్ హోమ్ పేజ్ పై జపాన్ పాప్యులర్ కార్టూన్ డోరేమాన్ బొమ్మను ఉంచారు హ్యాకర్లు. అంతే కాదు, 'డోరేమాన్!!! పికప్ ది కాల్' అనే రెండు లైన్లను పోస్ట్ చేశారు. దీంతో పాటు డోరేమాన్ హిందీ టైటిల్ సాంగ్ ను కూడా ప్లే చేశారు. కొందరు వ్యక్తులు వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ను తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ ఉదయం వెబ్ సైట్ ను రీస్టోర్ చేశారు. ఈ ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు వెబ్ సైట్ ను బ్రెజిల్ కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.
Tue, Sep 11, 2018, 12:07 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View