త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాం: రామ్, లక్ష్మణ్
Advertisement
సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ఫైట్ మాస్టర్స్ గా పేరు తెచ్చుకున్న రామ్, లక్షణ్... త్వరలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నామని సంచలన విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ, త్వరలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నామని చెప్పారు. సినిమాలు మానేసిన తర్వాత హైదరాబాద్ వదిలేసి, పల్లెటూరి వాతావరణంలో జీవనం సాగించాలని కోరుకుంటున్నామని తెలిపారు. తాము పుట్టి పెరిగిన కారంచేడులో చిన్నచిన్న సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము మహేష్ బాబు సినిమా 'మహర్షి'తో పాటు చిరంజీవి చిత్రం 'సైరా'కు పని చేస్తున్నామని తెలిపారు. పూరీ జగన్నాథ్ తమకు మంచి గుర్తింపును తీసుకొచ్చారని చెప్పారు.

1987లో చెన్నయ్ వెళ్లి రామ్, లక్ష్మణ్ ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదట్లో ఫైట్ మాస్టర్స్ కు అసిస్టెంట్స్ గా పని చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాదుకు వచ్చిన తర్వాత వారు ఇక్కడకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. 31 ఏళ్ల కెరీర్ లో 11వందలకు పైగా సినిమాలకు ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు.  
Tue, Sep 11, 2018, 11:41 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View