అధిష్ఠానం ఆదేశిస్తే సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా: టీడీపీ నేత వల్లారపు శ్రీనివాస్
Advertisement
హైకమాండ్ ఆదేశిస్తే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తానని ఆ పార్టీ నగర కార్యదర్శి వల్లారపు శ్రీనివాస్ కుమార్ తెలిపారు. టీడీపీలో తాను గత 36 సంవత్సరాలుగా పని చేస్తున్నానని చెప్పారు. 1982 నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని తెలిపారు. డివిజన్ స్థాయి, బూత్ కమిటీ నుంచి గ్రేటర్‌ కమిటీ వరకు ఎన్నో కీలక పదవుల్లో పని చేశానని చెప్పారు. తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదుగురు డివిజన్ అధ్యక్షుల మద్దతుతో పాటు సీనియర్ నేతల అండదండలు కూడా ఉన్నాయని తెలిపారు. 
Tue, Sep 11, 2018, 10:27 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View