కోర్టుకు హాజరైన ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌!
Advertisement
 ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ కోర్టు ముందు హాజరయ్యారు. ఓ హ్యాకింగ్ కేసుకు సంబంధించి లక్ష్మణ్‌ కూకట్ పల్లి కోర్టుకు వచ్చారు. హైదరాబాద్, సనత్ నగర్ లోని డీసీబీ బ్యాంకులో లక్ష్మణ్‌కు అకౌంట్ ఉంది. 2014లో ఓ హ్యాకర్ ఈ అకౌంట్ నుంచి రూ.10 లక్షలు తస్కరించాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ సూచనతో లక్ష్మణ్ పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. మరుసటి ఏడాది సదరు హ్యాకర్ ను పట్టుకున్నారు. అతని నుంచి మొత్తం నగదును రికవరీ చేయగలిగారు. ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పేందుకు లక్ష్మణ్‌ నిన్న న్యాయస్థానానికి వచ్చారు. లక్ష్మణ్‌ వెంట ఆయన న్యాయవాది హర్షవర్ధన్ ఉన్నారు.
Tue, Sep 11, 2018, 10:13 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View