సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  ఇప్పటి వరకు కన్నడలో రెండు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి అక్కడి ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక తమన్నా త్వరలో ఓ కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఈ విషయం గురించి ఈ ముద్దుగుమ్మ చెబుతూ, 'కన్నడలో హీరోయిన్ గా నటించాలని ఎప్పటి నుంచో వుంది. ఆ కోరిక త్వరలో నెరవేరుతోంది. త్వరలోనే ఓ సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పింది.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా రూపొందించిన 'నవాబ్' చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, జయసుధ, అదితీరావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళ వెర్షన్లు ఒకే రోజున విడుదలవుతాయి.
*  రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రవితేజ మూడు పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఇలియానా నాయికగా నటించింది. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
Tue, Sep 11, 2018, 07:20 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View