జపాన్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను రాబడుతున్న ‘మగధీర’
Advertisement
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీ రెండు పార్టులు జపాన్‌లో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సుబ్బరాజును తెగ అభిమానించారు అక్కడి ప్రేక్షకులు. ఈ సినిమాకు వచ్చిన ఆదరణను చూసిన రాజమౌళి... గతంలో తాను తెరకెక్కించిన 'మగధీర' చిత్రాన్ని కూడా జపాన్‌లో విడుదల చేశారు.

ఈ చిత్రం కూడా జపాన్ ప్రజలను బాగానే ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రిలీజైన పది రోజుల్లోనే రూ.17 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల బాహుబలి సినిమా సమయంలో సుబ్బరాజుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు అక్కడి ప్రేక్షకులు. అప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో.. ఇప్పుడు మగధీరకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అంతగానూ వైరల్ అవుతున్నాయి. సినిమా తమకెంతో నచ్చిందని దర్శకధీరుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 
Mon, Sep 10, 2018, 10:03 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View