నా సతీమణి నారా భువనేశ్వరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు: చంద్రబాబునాయుడు
Advertisement
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతుల పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు.

‘ప్రజా పాలనలో తలమునకలై ఉండే నాకు అనునిత్యం తోడై ఉండి, కుటుంబానికి అన్నీ తానై నడిపించే నా సతీమణి నారా భువనేశ్వరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో చంద్రబాబు, భువనేశ్వరి నవ్వుతూ ఉండగా, మనవడు దేవాన్ష్ చంద్రబాబు ఒళ్లో కూర్చుని ఉండటం కూడా ఈ ఫొటోలో గమనించవచ్చు.
Mon, Sep 10, 2018, 09:42 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View