మరో సినిమాకు సిద్ధమవుతున్న విశాల్, తమన్నా జంట
Advertisement
విశాల్, తమన్నా జంట మరో సినిమాలో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే అంబల, కత్తిసండై, మదగజరాజ చిత్రాలు రూపొందాయి. అయితే, 'మదగజరాజ' చిత్రం కారణాంతరాల వల్ల విడుదలకే నోచుకోలేదు. ఇక 'అంబల' విషయానికి వస్తే ఇద్దరికీ ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది.

తాజాగా ఇప్పుడు సుందర్.సి. దర్శకత్వంలో కోలీవుడ్‌లో విశాల్, తమ్ము జంటగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. సుందర్ ప్రస్తుతం శింబు హీరోగా 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే విశాల్, మిల్కీ బ్యూటీ కాంబోలో సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ ముద్దుగుమ్మకి తమిళంలో రెండు సంవత్సరాలుగా అవకాశాలే లేవు. ఇప్పుడు సుందర్ తన చిత్రంలో అవకాశం కల్పించారు. ఈ చిత్రమైనా విశాల్, తమ్ము జంటకు కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.  
Mon, Sep 10, 2018, 09:38 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View