రేపు హైదరాబాదుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం
Advertisement
తెలంగాణలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం రేపు హైదరాబాద్ కు రానుంది. రెండు రోజుల పాటు పర్యటించనున్న ఈ బృందంలో ఎనిమిది నుంచి పది మంది సభ్యులు ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, సవరణలు, ఈవీఎంల సర్దుబాటు, వీవీప్యాట్ ల అనుసంధానం, భద్రత, పోలింగ్ సిబ్బంది, సమస్యాత్మక ప్రాంతాలు తదితర అంశాలపై  కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు సమాలోచనలు చేయనున్నారు.

ఇదిలా ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సమాచారంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి దృష్టి సారించారు. రాష్ట్ర డీజీపీ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో జోషి సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Mon, Sep 10, 2018, 08:58 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View