సడెన్‌గా సెట్లో ప్రత్యక్షమై అఖిల్‌ని సర్‌ప్రైజ్ చేసిన 'జున్ను'!
Advertisement
  అక్కినేని అఖిల్, వెంకీ అట్లూరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సెట్‌లో మైరా దండేకర్ (జున్ను) సడెన్‌గా ప్రత్యక్షమై ఈ యంగ్ హీరోకి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిన్నారి అఖిల్ నటించిన రెండో సినిమా ‘హలో’లో జున్ను పాత్ర (హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ చిన్ననాటి పాత్ర)లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

ఇక సెట్లో హఠాత్తుగా జున్నూను చూడగానే ఆశ్చర్యపోయిన అఖిల్ ఆ చిన్నారిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఫొటోకు పోజిచ్చాడు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మంచి సర్‌ప్రైజ్ ఇచ్చినందుకు థాంక్యూ స్వీట్ హార్ట్ మైరా దండేకర్. నీ నవ్వు నీలాగే ప్రత్యేకం. నీ టాలెంట్ చాలా విలువైనది. దాన్ని నీతోనే భద్రంగా ఉండనివ్వు. త్వరలోనే మళ్లీ కలుద్దాం. నా ప్రేమ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది జున్ను’’ అని అఖిల్ ట్వీట్ చేశాడు. జున్ను కూడా ఇన్‌స్టాగ్రాంలో ‘హైదరాబాద్ సెట్లో నా సోదరుడు అఖిల్‌ను సర్‌ప్రైజ్ చేశా. టైం చాలా సరదాగా గడిచింది’ అని పేర్కొంది.
Mon, Sep 10, 2018, 08:57 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View