బీజేపీ, వైసీపీ ఒకే ముసుగు వేసుకున్నాయి.. వీరి ఆటలు సాగవు!: చంద్రబాబు మండిపాటు
Advertisement
కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కుట్రలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరన్న విషయం గుర్తుంచుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. కేంద్రానికి అధికారం ఉంది కదా అని, ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను దుర్వినియోగం చేయడం సబబు కాదని అసెంబ్లీలో సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు అన్నారు.

వైసీపీ అధినేత జగన్ తో తమకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈరోజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. బీజేపీ, వైసీపీ ఒకే ముసుగు వేసుకున్నాయని, అది మోదీ ముసుగు అని, ఇకపై ముసుగువీరుల ఆటలు రాష్ట్రంలో సాగవని హెచ్చరించారు.
Mon, Sep 10, 2018, 08:11 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View