నివాస భవనాల్ని నిర్మించే క్రమంలో దొరికిన బంగారు నాణేల పాత్ర!
Advertisement
పాత థియేటర్ కూల్చేసి కొత్తగా నివాస భవనాల్ని నిర్మించే క్రమంలో కళ్లు చెదిరిపోయే సంపద లభించింది. ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది.

ఉత్తర ఇటలీలోని ఓ ప్రాంతంలో ఉన్న పాత థియేటర్‌ను కూల్చేసి కొత్తగా నివాస భవనాల్ని నిర్మించాలని దాని యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగా పునాది తీయడం ప్రారంభించింది. పనులు కొనసాగుతుండగా రాతిపాత్ర కనిపించింది. దానిని తీసి చూడగా వందల సంఖ్యలో పురాతన రోమన్ బంగారు నాణెలు లభ్యమయ్యాయి. ఈ విషయమై స్పందించిన సాంస్క‌‌ృతిక శాఖా మంత్రి అల్బెర్టో బొనిసొలి ఆ ప్రాంతం పురాతత్వానికి అసలైన నిధి అని.. బంగారు నాణేల చారిత్రక ప్రాముఖ్యత తెలుసుకోవాల్సి వుందని అన్నారు.
Mon, Sep 10, 2018, 08:23 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View