‘మణికర్ణిక’ నుంచి మరొకరు ఔట్.. ఈసారి నిర్మాత వంతు!
Advertisement
కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన 'మణికర్ణిక' సినిమాకు ఒకదాని తర్వాత మరొక ఇబ్బంది వచ్చి పడుతూనే ఉంది. ఈ సినిమా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతుండడం ఒక విశేషమైతే.. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించటం మరో విశేషం. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం బాగానే నడిచింది. ఈ సినిమాకు మొదట డైరెక్టర్‌గా వ్యవహరించిన క్రిష్ జాగర్లమూడి ప్రాజక్ట్ నుంచి తప్పుకోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.

బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ బాధ్యతలు క్రిష్ చేపట్టడంతో ‘మణికర్ణిక’పై దృష్టి సారించలేక ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. చేసేదేమీలేక ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను కంగన స్వయంగా చేపట్టింది. దీంతో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాల్సిన సోనూసూద్ కంగన తీరు నచ్చక తప్పుకున్నారు.

ఇక తాజాగా ఏకంగా ఈ సినిమా నిర్మాత సంజయ్ కుట్టి కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి కారణం షూటింగ్ లేట్ కావడమేనట. దీంతో బడ్జెట్ బాగా పెరిగిపోయిందని సమాచారం. రూ.70 కోట్లతో అయిపోతుందనుకున్న నిర్మాణ వ్యయం రూ.100 కోట్లకు చేరుకునేలా ఉందట. దీంతో సంజయ్ తప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను కొత్త నిర్మాతలు తీసుకున్నారని తెలుస్తోంది.
Mon, Sep 10, 2018, 06:56 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View