హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు.. ఇద్దరు దోషులకు ఉరి శిక్ష విధించిన కోర్టు!
Advertisement
హైదరాబాద్ లోని లుంబీనీ పార్క్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ఈ ఘటనలో బాంబులు అమర్చిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అనిఖ్ షఫీఖ్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ లకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజుమ్ కు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్టు ప్రత్యేక కోర్టు తీర్పు నిచ్చింది.

కాగా, 2007 ఆగస్ట్ 25 న ఉగ్రవాదులు ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో అక్బర్ ఏ1, అనిఖ్ ఏ2 ముద్దాయిలుగా ఉన్నారు. ఈ నెల 4న వీరిని దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణ సుమారు పదకొండేళ్ల పాటు జరిగింది. ఈ కేసుకు సంబంధించి సాదిక్, ఫారూఖ్ లను నిర్దోషులుగా కోర్టు ఇప్పటికే ప్రకటించింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారులు భత్కల్ సోదరులు పరారీలో ఉన్నారు.
Mon, Sep 10, 2018, 06:11 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View