దానం నాగేందర్ కు టికెట్ కేటాయించిన కేసీఆర్!
Advertisement
మాజీ మంత్రి దానం నాగేందర్ కు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ గోషామహల్ సీటును దానంకు కేసీఆర్ కేటాయించారు. ఈ విషయాన్ని 13వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్ పేరు టీఆర్ఎస్ తొలి జాబితాలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రహస్యంగా భేటీ అయినట్టు కూడా వార్తలు కూడా వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో, ఆ స్థానానికి దానం సరైన అభ్యర్థి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Mon, Sep 10, 2018, 05:40 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View