రాజధాని పేరిట టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు: సోము వీర్రాజు ఆరోపణ
Advertisement
ఏపీ టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు ఆరోపణలు గుప్పించారు. శాసనమండలిలో రాజధాని అమరావతిపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీపై టీడీపీ నేతలు విమర్శలు చేయడాన్ని సోము వీర్రాజు నిరసించారు. శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోము వీర్రాజు మాట్లాడుతూ, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడు పొగుడుతూ తీర్మానాలు చేశారని, ఎన్డీఏ నుంచి ఆ పార్టీ విడిపోయాక మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, రాజధాని నిర్మాణం నిమిత్తం కేంద్రం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తే, వర్షమొస్తే కారిపోయే తాత్కాలిక భవనాలను కట్టారని ఆరోపించారు.
Mon, Sep 10, 2018, 04:56 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View