జర్నలిస్టుల కోసం రూ.వంద కోట్లు కేటాయించాం!: ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
ఏపీ జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణం అంశంపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ,
జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్లు కేటాయించామని, రాజధాని, గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కట్టని విధంగా ఏపీలో ఇళ్లు నిర్మిస్తున్నామని, వీటి విలువ రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. పదిహేను రోజులకొకసారి ఇళ్ల నిర్మాణాలను సమీక్షిస్తున్నామని చెప్పారు. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని మన పెద్దవాళ్లు అంటుంటారు, ఎందుకంటే, అవి  కష్టంతో కూడుకున్న పనులని అన్నారు. ఇల్లు కట్టుకోవాలంటే.. స్థలం, డిజైన్ మొదలైన వాటికి అవస్థపడాల్సి వచ్చేదని, ఇప్పుడు, ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా ఉత్తమ నాణ్యతతో ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు అన్నారు.
Mon, Sep 10, 2018, 04:01 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View