టీడీపీలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
Advertisement
ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చలు జరిపినట్టు సమాచారం. చర్చలు ఫలప్రదం అయ్యాయని, సైకిల్ ఎక్కడమే మిగిలి ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు, ఎచ్చెర్ల నుంచి ఒకసారి నీలకంఠంనాయుడు పోటీ చేశారు. 2009లో ఎచ్చెర్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ లభించలేదు. మరోవైపు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు నీలకంఠంనాయుడు అత్యంత సన్నిహితుడు.
Mon, Sep 10, 2018, 02:32 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View