జగిత్యాలలో ఎడ్ల బండి నడిపి నిరసన తెలిపిన జీవన్‌రెడ్డి
Advertisement
Advertisement
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారత్‌ బంద్‌ విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి ఎడ్ల బండి నడుపుతూ తన నిరసన తెలియజేశారు. తొలుత కాంగ్రెస్‌ కార్యకర్తలు బస్‌ డిపో ఎదుట ధర్నాకు దిగారు. బస్సుల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ధరలను అదుపు చేయాలని డిమాండ్‌ చేశారు. 
Mon, Sep 10, 2018, 01:23 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View