ఐదేళ్ల నా ప్రేమకు ఇప్పుడు అంగీకారం లభించింది... డిసెంబర్ లోనే పెళ్లన్న క్రికెటర్ సంజూ శాంసన్!
Advertisement
తాను ఐదేళ్లుగా ప్రేమిస్తున్న యువతితో పెళ్లికి తన తల్లిదండ్రులు అంగీకారాన్ని తెలిపారని భారత క్రికెట్ జట్టు సభ్యుడు సంజూ శాంసన్ సంబరపడిపోతున్నాడు. తన చిరకాల గర్ల్ ఫ్రెండ్ చారూను డిసెంబర్ లో వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు. తన ప్రేమ కథను చెబుతూ, 2013లో ఆగస్టు 22వ తేదీన తొలిసారిగా ఆమెకు హాయ్ చెప్పానని గుర్తు చేసుకున్నాడు.

 తామిద్దరమూ ప్రేమించుకున్నామని, కలసి గడిపామని, అయితే, బహిరంగంగా మాత్రం ఎక్కడా తిరగలేదని అన్నాడు. నేడు తమ పెళ్లికి తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, చారూ కుటుంబంతో మాట్లాడి పెళ్లిని ఫిక్స్ చేసినందుకు కృతజ్ఞతలని అన్నాడు. డిసెంబర్ 22న తమ పెళ్లి జరుగుతుందని, చారూ తండ్రి తిరువనంతపురంలో సీనియర్ జర్నలిస్టని వెల్లడించాడు.
Mon, Sep 10, 2018, 12:32 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View