తమిళ హాస్య నటుడు కోవై సెంథిల్ కన్నుమూత!
Advertisement
 తమిళ హాస్య నటుడు కోవై సెంథిల్(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కేవలం హాస్యనటుడిగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆయన రాణించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాణించిన పడయప్పా (తెలుగులో నరసింహా గా డబ్ అయింది) తో పాటు ఇదునమ్మ ఆళు, గోవా తదితర చిత్రాల్లో ఆయన నటించారు.

కోవై సెంథిల్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సెంథిల్ అసలు పేరు కుమారస్వామి. కోవై సమీపంలోని వడవల్లి ఆయన స్వస్థలం. అనారోగ్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెంథిల్ మృతిపై నడిగర్‌ సంఘం సంతాపం వ్యక్తం చేసింది.
Mon, Sep 10, 2018, 12:45 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View