పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నేత హల్ చల్.. గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు!
Advertisement
తన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం నేత ఒకరు హల్ చల్ చేశారు. అభిమానుల కోరిక మేరకు గాల్లో తుపాకీతో కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. సదరు నేత నిర్వాకంపై ఓ వ్యక్తి వీడియో సాక్ష్యాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మధ్యప్రదేశ్ బీజేవైఎం జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు రాహుల్ రాజ్ పుత్ భోపాల్ లోని బైరాగఢ్ లో తన పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు గాల్లో కాల్పులు జరుపుతూ ఎంజాయ్ చేశారు. ఆయనకు బీజేవైఎం జిల్లా చీఫ్ నితిన్ దూబే తోడయ్యారు. ఆయన కూడా ఈ గన్ తీసుకుని గాల్లోకి కాల్చారు.

కాగా, ఈ ఘటనపై ఓ వ్యక్తి వీడియో ఫుటేజీ తో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాహుల్ స్పందిస్తూ.. తాను లైసెన్స్ ఉన్న ఎయిర్ గన్ తోనే కాల్చాననీ, తన రివాల్వర్ ను వాడలేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల కోరిక మేరకే ఈ కాల్పులు జరిపానని వివరణ ఇచ్చారు. 
Mon, Sep 10, 2018, 12:10 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View