ఫొటో అయినా, వీడియో అయినా చైతూ అనుమతితోనే పోస్టింగ్‌: సమంత
Advertisement
సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్‌ పెట్టే విషయంలో చురుకుగా వ్యవహరించే అగ్ర కథానాయిక సమంత తన భర్త, హీరో చైతన్య విషయంలో మాత్రం అతని అనుమతి లేకుండా ఏ పనీ చేయనంటోంది. సోషల్‌ మీడియాలో చైతూకి సంబంధించిన వీడియో అయినా, ఫొటో అయినా పెట్టాలంటే ముందు అతని అనుమతి కోరతానని చెబుతోందీ ముద్దుగుమ్మ.

తనతోపాటు చైతన్య చిత్రాల విషయాలే కాదు, వ్యక్తిగత విషయాలను కూడా సామ్‌ అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సమంత నటించిన కన్నడ రీమేక్‌ ‘యూ టర్న్‌’ ఈ నెల 13న విడుదవుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా అదే రోజు విడుదలవుతోంది.
Mon, Sep 10, 2018, 11:51 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View