ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే గెలుపు: సబ్బం హరి
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే గెలుపని మాజీ ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే మంచి పాలనను అందిస్తామనే భరోసాను ప్రజలకు కల్పించడంలో వైసీపీ పూర్తిగా విఫలమయిందని తెలిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలను, మోసాలను ప్రజలకు వివరించడంలో చంద్రబాబు సఫలమయ్యారని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని చెప్పారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యానికి విలువే లేకుండా పోయిందని మండిపడ్డారు.

2019 ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని సబ్బం హరి తెలిపారు. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి ఏ మాత్రం లేదని చెప్పారు. మోదీ గ్రాఫ్ పడిపోతోందని, బీజేపీ ప్రజాదరణను కోల్పోతోందని తెలిపారు. 
Mon, Sep 10, 2018, 11:50 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View